రీ షూట్ తో అఖిల్ హ్యాపీస్..
ప్రస్తుతం అక్కినేని వారసుడు అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. రొమాంటిక్ లవ్ స్టోరీ గా రూపొందుతున్న ఈ సినిమాను బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తున్నాడు. పరుగు తర్వాత భాస్కర్ ఖాతాలో మరో హిట్ లేదు. అలాగే ఇప్పటికే మూడు సినిమాలు చేసినప్పటికీ ఇంకా కెరీర్ ఫస్ట్ కోసమే వెయిట్ చేస్తున్నాడు అఖిల్. దీంతో వీరిద్దరి కాంబోలో రాబోతున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ పైనే తన ఆశలన్నీ పెట్టుకున్నాడు అఖిల్.
అయితే ఈ సినిమా మొదలు పెట్టిన నుంచి ఇప్పటి వరకు ఏదోక రూపంలో సమస్యలు తలెత్తుతూనే ఉన్నాయి. వాస్తవానికి ఈ సినిమా పోయిన ఏడాది ఏప్రిల్ లో రిలీజ్ కావాల్సింది. కానీ లాక్డౌన్ కారణంగా ఈ ఇయర్ సంక్రాంతికి రిలీజ్ చేద్దామనుకున్నారు. కానీ రిలీజ్ అనేసరికి మళ్లీ ఇంకో సమస్య. రీ షూట్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఈ సినిమా కొంచెం షాదీ ముబారక్ సినిమాను పోలి ఉండటం. మొగలి రేకులు సీరియల్ ఫేమ్ సాగర్ నటించిన ఈ సినిమా స్టోరీ దాదాపు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ స్టోరీ లాగే ఉంటుందని టాక్ రావడంతో రీ షూట్ కు వెళ్లారు సినీ యూనిట్.
సెకండాఫ్ లో కొన్ని ఛేంజెస్ చేసి, కొత్తగా రీ షూట్ చేశారు. అయితే రీసెంట్ గా రిలీజ్ అయిన షాదీ ముబారక్ బాక్సాఫీస్ వద్ద తేలిపోయింది. దీంతో అఖిల్ ఫుల్ హ్యాపీ గా ఉన్నట్లు తెలుస్తుంది. అంతేకాదు రీ షూట్ చేయడం కూడా మంచిదైందని అఖిల్ అభిప్రాయ పడుతున్నాడట. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ను బన్నీ వాస్ నిర్మిస్తున్నారు.













