ప్రభాస్ కథతో అఖిల్ సినిమా?
ప్రస్తుతం ఏజెంట్ సినిమాతో థియేటర్స్‌లో ఉన్న అఖిల్ అక్కినేని నెక్ట్స్ మూవీకి రెడీ అవుతున్నాడు. యూవీ క్రియేషన్స్‌లో అఖిల్ తర్వాతి సినిమా ఉండబోతుంది. ఈ సినిమాతో అనీల్ అనే కొత్త దర్శకుడు తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమవుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ మొదలుపెట్టుకుంది.
జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానున్న ఈ సినిమాతో దర్శకుడిగా మెగా ఫోన్ పట్టబోతున్న అనీల్ గతంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌కి ఓ స్టోరీ నెరేట్ చేశాడని టాక్ ఉంది. సాహో, రాధేశ్యామ్ సినిమాలకు అనీల్ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేశాడు. సాహో టైమ్‌లోనే అనీల్ యూవీ నిర్మాతలకు ఓ స్టోరీ లైన్ చెప్పి మెప్పు పొందాడు. ఆ స్టోరీని ప్రభాస్‌తో చేయించాలని నిర్మాతలు భావించారట.
కానీ సాహో, రాధే శ్యామ్ ఎఫెక్ట్‌తో అనీల్ ను ప్రభాస్ కు జోడీ చేయడం కరెక్ట్ కాదని భావించి, ఇప్పుడు ఆ సినిమాను అఖిల్‌కు అప్పచెప్పినట్లు తెలుస్తోంది. అయితే ప్రభాస్ కోసం సిద్ధం చేసిన ఆ స్టోరీతోనే ఇప్పుడు అనీల్ అఖిల్ తో సినిమా చేస్తున్నాడా? అనేది తెలియాల్సి ఉంది.
అఖిల్ సరైన హిట్ కోసం ఎన్నో ఏళ్లుగా వెయిట్ చేస్తున్నాడు. రీసెంట్గా వచ్చిన ఏజెంట్ భారీ డిజాస్టర్ అనిపించుకుంది. దీంతో నెక్ట్స్ సినిమా విషయంలో అఖిల్ ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు. యూవీ నిర్మాణంలో అఖిల్ తీయబోయే సినిమాతో అయినా అఖిల్ కు మంచి హిట్ వస్తుందని ఫ్యాన్స్ అందరూ ఎంతో ఆతృతగా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.













