ఏజెంట్ పైనే అఖిల్ ఆశలన్నీ!
టాలీవుడ్ యంగ్ హీరో, అక్కినేని వారసుడు అఖిల్ రీసెంట్ గానే తన ఐదవ సినిమా ఏజెంట్ ను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఎందుకో ఈసారి అక్కినేని ఫ్యాన్స్ అఖిల్ ఏజెంట్ పై ఎంతో నమ్మకంతో ఉన్నట్లు తెలుస్తుంది. కెరీర్ మొదలు పెట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్న అఖిల్, ఏజెంట్ సినిమాతో తన కెరీర్ బెస్ట్ హిట్ కొట్టేలా ఉన్నాడని ఫ్యాన్స్ చెప్తున్నారు.
వాస్తవానికి అఖిల్ మొదటి సినిమా నుంచి మొన్న వచ్చిన హలో, మిస్టర్ మజ్ను వరకు అన్నీ తనను డామేజ్ చేసిన సినిమాలే. ఇన్ని ఫ్లాపులొచ్చినా సరే అక్కినేని ఫ్యాన్స్ మాత్రం అఖిల్ కు భరోసా ఇస్తూ వెన్నంటే ఉంటున్నారు. రీసెంట్ గా తన నాలుగో సినిమాను పూర్తి చేశాడు అఖిల్. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా తెరకెక్కిన ఈ క్లాస్ రొమాంటిక్ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
అయితే ఈ సినిమా విషయంలో అందరికీ పెద్దగా అంచనాలేమీ లేవని చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు సినిమాకు సంబంధించిన ఏ ప్రమోషన్స్ ను సరిగా చేసింది లేదు. ఇదిలా ఉంటే మరో పక్క కొత్తగా అనౌన్స్ చేసిన ఏజెంట్ సినిమా సురేందర్ రెడ్డి డైరక్షన్ లో తెరకెక్కనుంది. ఇప్పటి వరకు ఆయన తీసిన సినిమాలు హిట్ అయినా ఫట్ అయినా సరే క్వాలిటీ విషయంలో మాత్రం ఎక్కడా కాంప్రమైజ్ అయింది లేదు. వక్కంతం వంశీ కథ అందిస్తున్న ఈ సినిమాను దాదాపు 40 కోట్ల బడ్జెట్ తో నిర్మించేందుకు అనిల్ సుంకర రెడీ అవుతున్నాడట. థమన్ ఈ సినిమాకు సంగీతమందిస్తున్నాడు. మిగిలిన వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి. మరి ఈ సినిమా అయినా అఖిల్ ఫ్యాన్స్ ఆశలను నిలుపుతుందేమో చూడాలి.













