అఖిల్ కు జోడీగా ప్రియాంక జవాల్కర్
అక్కినేని అఖిల్‌కు జోడీగా ప్రియాంక జవాల్కర్ ఎంపిక అయినట్టు సమాచారం. అఖిల్ ప్రతిష్టాత్మక నాల్గవ చిత్రం గీతా ఆర్ట్స్ లో రూపొందబోతోంది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ అక్కినేని హీరోగా నటించబోతున్న చిత్రం కోసం గీతా ఆర్ట్స్ ప్రియాంక జువాల్కార్ను సంప్రదించినట్టు తెలిసింది. అఖిల్‌కు జోడీగా నటించే అవకాశం రావటంతో ఈ అమ్మడి కి లక్ కలిసి వచ్చిందని అంటున్నారు. ఈ సినిమాలో అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. ఇలాంటి క్రేజీ మూవీలో ప్రియాంక జువాల్కర్ నటించే అవకాశం దక్కించుకున్న నేపథ్యంలో ఆమె కెరీర్ టర్న్ అయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు.













