ప్రియాంక జవాల్కర్ కు లక్కీ ఆఫర్
యంగ్ బ్యూటీ ప్రియాంక జవాల్కర్ తెలుగులో టాక్సీవాలా చిత్రంతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో యంగ్ స్టార్ విజయ్ దేవరకొండ జోడీగా నటించిన ఆమె మంచి హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత రవితేజ సినిమాలో హీరోయిన్గా నటించే అవకాశాన్ని దక్కించుకుంది ప్రియాంక జవాల్కర్. డిస్కో రాజా చిత్రంలో ఆమె హీరోయిన్గా ఎంపికైనట్లు తెలిసింది. తాజాగా అక్కినేని అఖిల్‌కు జోడీగా ప్రియాంక జవాల్కర్ ఎంపికైనట్లు ప్రచారం జరుగుతోంది. అఖిల్ ప్రతిష్టాత్మక నాలుగవ సినిమా గీతా ఆర్ట్స్ లో రూపొందనుంది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కే ఈ సినిమా కోసం గీతా ఆర్ట్స్ వారు ప్రియాంకను సంప్రదించినట్లుగా తెలిసింది. అఖిల్‌కు జోడీగా నటించే అవకాశం రావడంతో ఈ అమ్మడికి అదృష్టం కలిసి వచ్చింది. గీతా ఆర్ట్స్ బ్యానర్లో ఈ మూవీ నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఇలాంటి క్రేజీ మూవీలో ప్రియాంక జవాల్కర్ నటించే అవకాశం దక్కించుకోవడంతో ఆమె కెరీర్ టర్న్ అయ్యే అకాశం ఉంది.













