అఖిల్ అక్కినేని #8 మూవీ లో హీరోయిన్ గా మోడల్ సాక్షి వైద్య
అఖిల్ అక్కినేని ప్రస్తుతం నటిస్తున్న సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ పూజా హెగ్డే నటిస్తున్న ఈ చిత్రాన్ని ఎంతో భారీ ఖర్చుతో జి ఏ 2 పిక్చర్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ సమర్పణలో, బన్నీ వాసు, వాసు వర్మ, ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి గోపీసుందర్ సంగీతాన్ని అందిస్తుండగా ప్రదీశ్ వర్మ ఫోటోగ్రఫీ అందిస్తున్నారు. ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ తో పాటు ఇందులోని ఒక సాంగ్ కూడా ఆడియన్స్ ని ఎంతో ఆకట్టుకున్నాయి. ఇక ఈ మూవీపై అక్కినేని అభిమానుల్లో భారీ స్థాయిలో అంచనాలున్నాయి. అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ సినిమా ఈ ఏడాది వేసవి కానుకగా రిలీజ్ అయ్యే అవకాశం కనపడుతోంది.
ఇక దీని తర్వాత అఖిల్ నటించనున్న సినిమాకి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించనున్నారు. యువ నిర్మాత అనిల్ సుంకర నిర్మాణ ఈ సంస్థ అయిన ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఎంతో భారీ వ్యయంతో ఈ సినిమా నిర్మితం కానుంది. అతి త్వరలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఇతర నటీనటులు సాంకేతిక నిపుణుల ఎంపిక పూర్తయిందని సమాచారం.
ఇక లేటెస్ట్ గా కొన్ని ఫిల్మ్ నగర్ వర్గాల నుండి అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ సినిమాలో అఖిల్ సరసన హీరోయిన్ గా యువ నటి, మోడల్ అయిన సాక్షి వైద్య ఎంపికయిందని తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితం ఆమెకి స్క్రీన్ టెస్ట్ కూడా చేసిందట మూవీ యూనిట్. మూవీ కథ, కథనాలు ఎంతో బాగా నచ్చిన సాక్షి వెంటనే నటించడానికి ఒప్పుకుందని సినిమాలో హీరో క్యారెక్టర్ తో పాటు ఆమె క్యారెక్టర్ కూడా అద్భుతంగా ఉంటుందని అంటున్నారు. ఇక రిలీజ్ తరువాత స్క్రీన్ పై అఖిల్, సాక్షి ల జంట ప్రేక్షకాభిమానులని అలరించడం ఖాయమని అలాగే ఈ మూవీతో అఖిల్ భారీ సక్సెస్ అందుకుంటారని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.













