సుబ్రమణ్యపురం ట్రైలర్ ను విడుదల చేసిన అక్కినేని అఖిల్
దేవుడిపైనే పరిశోధనలు చేసిన ఓ వ్యక్తి జీవితంలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకొన్నాయో తెలియాలంటే మా చిత్రం చూడాల్సిందే అంటున్నారు సుమంత్. ఆయన కథానాయకుడిగి నటించిన చిత్రం సుబ్రమణ్యపురం. ఈషా రెబ్బా నాయిక. సంతోస్ జాగర్లపూడి దర్శకుడు. బీరం సుధాకర్‌రెడ్డి నిర్మిస్తున్నారు. హైదరాబాద్‌లో అఖిల్ అక్కినేని ముఖ్య అతిథిగా హాజరై ట్రైలర్‌ని విడుదల చేశారు. అఖిల్ మాట్లాడుతూ సుబ్రమణ్యపురం ట్రైలర్ చూస్తుంటే సినిమాపై ఆసక్తి ఏర్పడుతోంది. ఇలాంటి కథలు దొరకడం చాలా కష్టం అన్నారు. సుమంత్ మాట్లాడుతూ సంతోష్ చెప్పిన కథ ఆసక్తికరంగా అనిపించింది. ఆయన చిత్రాన్ని తెరకెక్కించిన విధానం బాగుందన్నారు. దర్శకుడు మాట్లాడుతూ అనుగ్రహించే దేవుడే ఆగ్రహిస్తే పరిస్థితేమిటన్నదే ఈ సినిమా కథాంశం అన్నారు. కార్తికేయ కంటే బాగా రూపుదిద్దుకున్న చిత్రమిదని చెప్పారు నిర్మాత. కార్యక్రమంలో ఈషా రెబ్బా మల్కాపురం శివకుమార్‌తో పాటు ఇతర చిత్రబృందం పాల్గొంది.













