ఫస్ట్ కాపీ రెడీగా ఉన్నా రిలీజ్ డేట్ విషయంలో డైలమా..
అఖిల్ అక్కినేని తన కెరీర్ స్టార్టింగ్ లో మొదలు పెట్టిన ఫైటింగ్ ఇప్పటికీ కొనసాగిస్తూనే ఉన్నాడు. తను చేసిన మూడు సినిమాలూ ఆశించిన ఫలితాన్నివ్వక పోవడంతో నాలుగో సినిమాతో అయినా ఎట్టి పరిస్థితుల్లో ఘన విజయం సాధించాలనే తపనతో ఉన్నాడు. ఈ క్రమంలోనే బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో పూజా హెగ్డే హీరోయిన్ గా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రం చేస్తున్నాడు.
ఈ సినిమాలో అఖిల్, పూజా ల మధ్య రొమాన్స్, లవ్ తారా స్థాయిలో ఉండనుందని ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్లతో అర్థమవుతుంది. వీరిద్దరి మధ్య రొమాంటిక్ సీన్స్ ఒక రేంజ్ లో వచ్చాయని, వారిద్దరి కెమిస్ట్రీ చాలా బాగా వర్కవుటయిందని, కొంచెం లక్ కలిసొస్తే అఖిల్ హిట్ కొట్టడం ఖాయమనే గుసగుసలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.
వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సింది. కానీ రీ షూట్ల కారణంగా కాస్త లేట్ అయింది. ఇప్పుడు ఆ షూట్స్ కూడా పూర్తి చేసుకుని ఫస్ట్ కాపీ తో సహా సిద్ధంగా ఉన్నారు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ టీమ్. అయినప్పటికీ రిలీజ్ డేట్ విషయం లో మాత్రం డైలామాలో ఉన్నారని తెలస్తుంది. జూన్ 19 రిలీజ్ డేట్ అని అనౌన్స్ అయితే చేశారు కానీ అప్పటికి కాంపిటీన్ హెవీగా ఉండటంతో సోలో రిలీజ్ కోసం డేట్ ను ఛేంజ్ చేసే యోచన లో ఉన్నారట మేకర్స్. మరి ఈ వార్తల్లో ఎంత నిజముంది తెలియాలంటే చిత్ర యూనిట్ నుంచి క్లారిటీ రావాల్సిందే.













