అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్
అక్కినేని అఖిల్ సినిమాకు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ టైటిల్ ఖరారు చేశారు. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకుడు. బన్నీవాసు, వాసు వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పూజా హేగ్డే హీరోయిన్గా నటిస్తోంది. కథకు తగినట్టుగా టైటిల్ నిర్ణయించినట్టు నిర్మాతలు వెల్లడించారు. ఈ సినిమా యూత్‌ని అలరించడమే కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్‌ని సైతం ఆకట్టుకుంటుందన్నారు. అఖిల్ అక్కినేనికి ఇది నాలుగవ చిత్రం. ఇతర పాత్రల్లో ఆమని, మురళిశర్మ, జయప్రకాశ్, ప్రగతి, సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం గోపీసుందర్, ఛాయాగ్రహణం ప్రదీశ్ ఎమ్ వర్మ.













