అఖిల్ ఏజెంట్ లేటెస్ట్ అప్డేట్..
అక్కినేని హీరో అఖిల్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తర్వాత ఒక భారీ ప్రాజెక్ట్ ను సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ అనే టైటిల్ తో అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ ను రీసెంట్ గా అఖిల్ బర్త్ డే సందర్భంగా ప్రకటించారు. సైరా తర్వాత దాదాపు రెండేళ్ల గ్యాప్ తో సురేందర్ రెడ్డి నుంచి ఏజెంట్ సినిమా మొదలవబోతుంది. వాస్తవానికి ఏజెంట్ సినిమా షూటింగ్ ఈనెలలోనే మొదలుపెట్టాలనుకున్నారు కానీ కరోనా కారణంగా అది కుదరలేదు.
దేశంలో కరోనా వేగంగా వ్యాప్తి చెందుతున్న తరుణంలో రోజుకి లక్షల్లో కేసులు నమోదవుతున్నాయి. ఈ టైమ్ లో ఏజెంట్ టీమ్ నుంచి షూటింగ్ గురించి తాజాగా అప్డేట్స్ వచ్చిందని తెలుస్తుంది. ఏజెంట్ షూటింగ్ మే2న గోవాలో మొదలు కానున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి. గోవాలో షెడ్యూల్ వీలైనంత త్వరగా పూర్తి చేసుకుని దేశంలోని అన్నీ ప్రాంతాల్లో షూటింగ్ కంప్లీట్ చేయాలన్న ఆలోచనలో ఉన్నారట.
ఆ తర్వాత అన్నీ వీలు చూసుకుని, కరోనా సిట్యుయేషన్ ను బట్టి వేదేశాలకు వెళ్లేది లేనిది డిసైడ్ అవ్వనున్నట్లు టాక్. వక్కంతం వంశీ కథ అందించిన ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందించనున్నాడు. సాక్షి వైద్య అనే కొత్త బ్యూటీ ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానుంది. ప్రస్తుతానికైతే అఖిల్ ఆశలన్నీ తను తాజాగా నటించిన చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ పైనే ఉన్నాయి.













