AKhanda2: పవన్ వర్సెస్ బాలయ్య తప్పేలా లేదు!
వరుస హిట్లతో ఫుల్ జోష్ లో ఉన్న నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) ప్రస్తుతం బోయపాటి శ్రీను(Boyapati Srinu) దర్శకత్వంలో అఖండ2: తాండవం(Akhanda2 Thandavam) చేస్తున్న సంగతి తెలిసిందే. బ్లాక్ బస్టర్ అఖండ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అందరికీ భారీ అంచనాలున్నాయి. దానికి తగ్గట్టే బోయపాటి అఖండ2(Akhanda2)ను తెరకెక్కిస్తున్నాడని సమాచారం.
అసలే బాలయ్య(Balayya)- బోయపాటి కాంబినేషన్ లో మూడు సినిమాలు రాగా అవన్నీ భారీ హిట్లుగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అఖండ2 కూడా భారీ బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందని అందరూ భావిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా సెప్టెంబర్ 25న రిలీజ్ కానుందని మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేయగా, అదే రోజున పవన్ కళ్యాణ్(pawan kalyan) నటించిన ఓజీ(OG) కూడా రానుందని, అందుకే అఖండ2 వాయిదా పడుతుందని వార్తలొచ్చాయి.
ఒకే రోజున అఖండ2, ఓజి సినిమాలు రిలీజవడం బాక్సాఫీస్ కలెక్షన్ల పరంగా నష్టాల్ని మిగులుస్తుందని తెలిసినా, రెండూ సినిమాలూ పోటీ పడటానికి రెడీ అవుతున్నాయని తెలుస్తోంది. అఖండ2 వాయిదా వార్తల్లో ఎలాంటి నిజం లేదని, ఎట్టి పరిస్థితుల్లో సినిమాను ముందు చెప్పినట్టు సెప్టెంబర్ 25కే రిలీజ్ చేస్తామని డైరెక్టర్ బోయపాటి రీసెంట్ గా ఓ సందర్భంలో కన్ఫర్మ్ చేసినట్టు తెలుస్తోంది. కాబట్టి పవన్ వర్సెస్ బాలయ్య తప్పేలా లేదు.







