అమెరికాలో మొదలుపెట్టనున్న బోయపాటి
బాలయ్య(NBK)- బోయపాటి(Boyapati) కాంబినేషన్లో వచ్చిన అఖండ(Akhanda) సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాలయ్య(Balakrishna) కెరీర్లోనే ఈ సినిమా ఎక్కువ కలెక్షన్స్ వసూలు చేసింది. ఈ సినిమాకు సీక్వెల్ గా అఖండ2 (Akhanda2) ను రీసెంట్ గా అనౌన్స్ చేశారు. రూ.150 కోట్ల భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా ప్రాజెక్టుగా రూపొందనున్న ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ ఇప్పటికే పూర్తయింది.
ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ ను కూడా బోయపాటి పూర్తి చేసినట్లు తెలుస్తోంది. అఖండలో లానే బాలయ్య(Balaiah) ఈ సినిమాలో కూడా రైతు పాత్రతో పాటూ అఘోర పాత్రను కూడా చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రగ్యా జైస్వాల్(Pragya Jaiswal) మొదటి సినిమాలో చేసిన కలెక్టర్ పాత్రలోనే కనిపించనుందని టాక్. ఇదిలా ఉంటే అఖండ2 గురించి ఇప్పుడో ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటికొచ్చింది.
అఖండ2 కోసం యూఎస్ బ్యాక్ డ్రాప్ లో ఓ యాక్షన్ ఎపిసోడ్‌ను బోయపాటి షూట్ చేయనున్నాడట. ఈ సీన్ తోనే సినిమా షూటింగ్ ను స్టార్ట్ చేయనున్నట్లు సమాచారం. ఓ ప్రమాదం నుంచి ప్రగ్యా జైస్వాల్ ను కాపాడటానికి బాలయ్య చాలా పెద్ద రిస్క్ చేస్తాడని, ఈ సీన్ చాలా ఇంటెన్స్ గా ఉండబోతుందని తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంతన్నది తెలియాల్సి ఉంది. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది.













