అఖండ2కు మ్యూజిక్ డైరెక్టర్ మారుతున్నాడా?
వరుస సక్సెస్లతో ఫుల్ జోష్ లో ఉన్న నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో తన 109వ సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను ఈ ఏడాదే రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఈ సినిమా తర్వాత బాలయ్య, బోయపాటి శ్రీనుతో అఖండ2ను లాక్ చేసుకున్న విషయం తెలిసిందే.
ఇంకా అఖండ2 అని కన్ఫర్మ్ చేయలేదు కానీ అంతర్గత సమాచారం మేరకు అదేనని టాక్. ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ ఎవరనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. తమన్ ఉంటాడనుకున్నారు కానీ ఇప్పటికే బాలయ్యతో తమన్ వరుసగా 4 సినిమాలు చేసి మంచి ఆల్బమ్స్ ఇచ్చాడు. అయినప్పటికీ మళ్లీ ఐదోసారి కూడా తమన్ కు ఛాన్స్ ఇవ్వడం సమంజసం కాదని చిత్ర యూనిట్ భావిస్తుందట.
అందుకే యానిమల్ సినిమాతో దేశవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న హర్షవర్ధన్ రామేశ్వర్ ను తీసుకోవాలని చూస్తున్నారట. హర్షవర్ధన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కు ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. హీరోయిజం ఉన్న సీన్స్ ను ఎలివేట్ చేయడంలో అతనికెంతో నైపుణ్యం ఉంది. అర్జున్ రెడ్డి సినిమా విషయంలో కూడా ఇది ప్రూవ్ అయింది. కాకపోతే స్టార్ హీరోల అవకాశాలు రాక వెనుకబడ్డాడు. యానిమల్ సినిమాతో తన సత్తా చాటడంతో ఇప్పుడు క్రమంగా అవకాశాలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే బాలయ్య సినిమా కూడా ఆయనకు వెళ్లే ఛాన్సుందంటున్నారు. ఏదేమైనా ఈ విషయంలో అధికారిక ప్రకటన వచ్చేవరకు నిర్దారణకు రాలేం.













