Akhanda2: అఖండ2లో నెవర్ బిఫోర్ సీక్వెన్స్

నందమూరి బాలకృష్ణ(nandamuri balakrishna) హీరోగా బోయపాటి శ్రీను(boyapati srinu) దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా అఖండ2(akhanda2). ఈ సినిమాపై ముందు నుంచి భారీ అంచనాలున్నాయి. బాలయ్య బోయపాటి కాంబినేషన్ మూవీ కావడంతో పాటూ అఖండ(akhanda) సినిమాకు సీక్వెల్ గా వస్తున్నందున దీనిపై మొదటి నుంచే భారీ హైప్ నెలకొంది. డిసెంబర్ 5న అఖండ2 ప్రేక్షకుల ముందుకు రానుంది.
రిలీజ్ కు మరో రెండు నెలలు కూడా లేకపోవడంతో దీపావళి నుంచి ఈ సినిమా ప్రమోషన్స్ ను మొదలుపెట్టాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. డివోషనల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న అఖండ2 లో బోయపాటి ఈసారి మరిన్నిడివోషనల్ అంశాలతో పాటూ అఘోరాలు, వారి శక్తులు, హిమాలయాల్లో వారి ప్రభావం ఎలా ఉంటుంది? లాంటి అంశాలను చూపించనున్నారట.
వాటితో పాటూ సినిమాలో విలన్ గా నటిస్తున్న ఆది పినిశెట్టి(Aadhi Pinisetty)కి, బాలయ్యకు మధ్య వచ్చే పోరాట సన్నివేశాలను నెవ్వర్ బిఫోర్ అనేలా బోయపాటి తెరకెక్కించాడని అంటున్నారు. అఖండ సినిమాను కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే ప్రమోట్ చేసిన టీమ్, ఈసారి అఖండ2 కోసం నార్త్ మార్కెట్ పై స్పెషల్ ఫోకస్ పెట్టనుందని అంటున్నారు. మరి ఈ మూవీ ఎన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.