Akhanda2: అఖండ2 షూటింగ్ అప్డేట్
వరుస సక్సెస్లతో ఫుల్ ఫామ్ లో ఉన్న నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) ప్రస్తుతం యంగ్ హీరోలకు పోటీగా సినిమాలను చేస్తున్నారు. సక్సెస్ ఇచ్చిన జోష్ తో తన తర్వాతి సినిమాను మరింత ఉత్సాహంతో చేస్తున్నారు బాలయ్య(Balayya). ప్రస్తుతం బాలకృష్ణ బోయపాటి శ్రీను(Boyapati Srinu) దర్శకత్వంలో అఖండ2(akhanda2) సినిమా చేస్తున్నసంగతి తెలిసిందే.
బాలయ్య, బోయపాటి కాంబినేషన్ కు ఎంత క్రేజ్ ఉందనేది కొత్తగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో మూడు సినిమాలు రాగా ఆ మూడూ సూపర్ హిట్లుగా నిలిచాయి. దీంతో అఖండ2 పై అందరికీ భారీ అంచనాలున్నాయి. పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతున్న అఖండ2 షూటింగ్ నిర్విరామంగా జరుగుతుండగా ఇప్పుడీ సినిమాకు సంబంధించిన ఓ అప్డేట్ బయటికొచ్చింది.
అఖండ2 షూటింగ్ ప్రస్తుతం మోతుగూడెంలోని నదీ ప్రవాహం వద్ద జరుగుతుందని, దానికి సంబంధించిన ఓ వీడియో కూడా నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఆ వీడియోలో బాలయ్య ఎలాంటి డూప్ లేకుండా ఎంతో వేగంగా ప్రవహిస్తున్న నదిలోకి వెళ్లి సీన్ ను చేస్తున్నట్టు అర్థమవుతుంది. ఈ వయసులో కూడా బాలయ్య ఇలాంటి రిస్క్ తీసుకోవడాన్ని అందరూ అభినందిస్తున్నారు. సెప్టెంబర్ 25న అఖండ2 రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.







