Akhanda2: అఖండ2లో మరో డిఫరెంట్ ఆయుధం
బ్యాక్ టు బ్యాక్ హిట్లతో మంచి జోష్ లో ఉన్నాడు నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna). ప్రస్తుతం ఆయన అఖండ2(Akhanda2) సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. బ్లాక్ బస్టర్ అఖండ(Akhanda) సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై నందమూరి అభిమానులతో పాటూ సినీ ప్రియులందరికీ భారీ అంచనాలున్నాయి. దానికి తోడు డైరెక్టర్ బోయపాటి శ్రీను(Boyapati Srinu).
బాలయ్య(Balayya)- బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ఇప్పటికే మూడు సినిమాలు రాగా, ఆ మూడు సినిమాలూ ఒకదాన్ని మించి మరొకటి హిట్లుగా నిలిచాయి. దీంతో వీరి కలయికలో వచ్చే అఖండ2 కూడా భారీ విజయం సాధిస్తుందని అందరూ ఎంతో నమ్మకంగా ఉన్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలోని ఓ అంశం పై నెట్టింట డిస్కషన్ జరుగుతుంది.
మామూలుగా బోయపాటి సినిమాల్లోని ఆయుధాలకు స్పెషల్ క్రేజ్ ఉంటుంది. ఆయుధాలను డిఫరెంట్ స్టైల్ లో తయారు చేయించి వాటిని హైలైట్ చేస్తూ ఉంటాడు. అఖండలో కూడా అఘోరా చేతిలోని త్రిశూలం చాలా కొత్తగా భిన్నంగా ఉంటుంది. ఇప్పుడు అఖండ2 లో కూడా బోయపాటి బాలయ్య కోసం ఓ అడ్వాన్డ్స్ వెర్షన్ ఆయుధాన్ని మైథాలజీ టచ్ చేస్తూ తయారు చేయించినట్టు తెలుస్తోంది. ఆ ఆయుధం ఫ్యాన్స్ కు మంచి కిక్ ఇస్తుందని యూనిట్ వర్గాలంటున్నాయి. సెప్టెంబర్ 25న అఖండ2 ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేయగా, ఈ సినిమాకు తమన్(Thaman) సంగీతం అందిస్తున్నాడు.






