Akhanda2: అఖండ2పై క్రేజీ రూమర్
నందమూరి బాలకృష్ణ(nandamuri balakrishna)- బోయపాటి శ్రీను(boyapati srinu) వీరి కాంబినేషన్ లో సినిమా వస్తుందంటే దానిపై ఏ రేంజ్ లో అంచనాలుంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే వీరి కలయికలో వచ్చిన సింహా(simha), లెజెండ్(Legend), అఖండ(akhanda) సినిమాలు ఒకదాన్ని మించి ఒకటి బ్లాక్ బస్టర్లు గా నిలిచి వీరి కాంబినేషన్ ను సూపర్ హిట్ కాంబినేషన్ ను చేశాయన్న సంగతి తెలిసిందే.
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాపై సోషల్ మీడియాలో క్రేజీ రూమర్ వినిపిస్తోంది. ఈ సినిమాలో సీనియర్ నటి విజయశాంతి(vijayasanthi) ఓ ముఖ్య పాత్ర చేయనుందని నెట్టింట వార్తలు వినిపిస్తున్నాయి. అఖండ2లో విజయశాంతి రాజకీయ నాయకురాలిగా కనిపించనుందని కూడా చెప్తున్నారు. ఇప్పటికే బాలయ్య- విజయశాంతి గతంలో చాలా సినిమాలు చేశారు.
ఇప్పుడు అఖండ2లో వీరిద్దరూ కలిసి నటిస్తే సినిమాకు అదొక స్పెషల్ ఎట్రాక్షన్ అవడం ఖాయం. కానీ ఈ విషయంలో ఇప్పటివరకు చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కాబట్టి ప్రస్తుతానికైతే ఈ వార్త పుకారే. రీసెంట్ గా నందమూరి కళ్యాణ్ రామ్(nandamuri kalyanram) తో అర్జున్ సన్నాఫ్ వైజయంతీ(arjun son of vyjayanthi) మూవీలో నటించిన విజయశాంతి ఇప్పుడు కళ్యాణ్ రామ్ బాబాయ్ అఖండ2లో కూడా నటిస్తుందేమో చూడాలి.






