Akhanda2: అఖండ2 బాలయ్య పాత్ర పై క్రేజీ అప్డేట్
అఖండ(Akhanda) సినిమా తర్వాత వీర సింహారెడ్డి(Veera Simha reddy), భగవంత్ కేసరి(Bhagavanth Kesari), డాకు మహారాజ్(Daku Maharaj) తో వరుస బ్లాక్ బస్టర్లు అందుకున్న బాలయ్య(Balayya) ప్రస్తుతం అఖండ మూవీకి సీక్వెల్ గా అఖండ2(Akhanda2) చేస్తున్న సంగతి తెలిసిందే. బోయపాటి శ్రీను(Bayataki Srinu) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అందరికీ భారీ అంచనాలున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమాలో బాలయ్య రెండు గెటప్స్ చేయనున్నాడనే విషయం అందరికీ తెలుసు.
అందులో ఒక పాత్ర నార్మల్ లుక్ లో ఉండనుండగా, రెండో పాత్ర అఘోరా అనే సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు అఖండ2లో బాలయ్య పాత్రపై ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వినిపిస్తోంది. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే బాలయ్య రెగ్యులర్ పాత్ర ఎంతో ఎమోషనల్ గా ఉంటుందని, అఖండతో కంపేర్ చేస్తే ఈ సినిమాలో ఫ్యామిలీ సెంటిమెంట్ చాలా ఎక్కువగా ఉంటుందని సమాచారం.
అఖండ సినిమా తరహాలోనే ఈ సినిమాలో కూడా బోయపాటి ఆలయాల పరిరక్షణ, శివతత్వాన్ని నెక్ట్స్ లెవెల్ లో చూపించనున్నాడని అంటున్నారు. 14 రీల్స్ ప్లస్(14Reels Plus) బ్యానర్ లో రామ్ ఆచంట(Ram Achanta), గోపీ ఆచంట(Gopi achanta) నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్(Thaman) సంగీతం అందిస్తుండగా ఈ మూవీలో ప్రగ్యా జైస్వాల్(Pragya Jaiswal), సంయుక్త మీనన్(Samyuktha Menon) కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. సెప్టెంబరు 28న అఖండ2 ప్రేక్షకుల ముందుకు రానుంది.













