Akhanda2: ఆ సెంటిమెంట్ ను ఫాలో అవుతున్న అఖండ2?
ఇండస్ట్రీ మరీ ముఖ్యంగా తెలుగు చిత్ర పరిశ్రమలో రిలీజ్ డేట్ల విషయం చాలా పెద్ద సమస్యగా మారింది. ఈ సమస్య ఎప్పుడు తీరుతుందో తెలియనంత మారింది పరిస్థితి. రోజురోజుకీ ఈ రిలీజ్ డేట్ల సమస్య బాగా ఎక్కువైపోతున్న నేపథ్యంలో పలు సినిమాలు సమస్యలు ఎదుర్కొంటున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పుడో పెద్ద సినిమా వాయిదా పడుతుందని సమాచారం.
నందమూరి బాలకృష్ణ(nandamuri Balakrishna) హీరోగా, బోయపాటి శ్రీను(Boyapati srinu) దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా అఖండ2 తాండవం(Akhanda2 Thandavam). భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా సెప్టెంబర్ 25న రిలీజ్ కానున్నట్టు మేకర్స్ ఎప్పుడో అనౌన్స్ చేశారు కానీ పోస్ట్ ప్రొడక్షన్ లేటవడం వల్ల సినిమా వాయిదా పడుతుందని, సెప్టెంబర్ నుంచి వాయిదా పడి డిసెంబర్లో రిలీజ్ చేయాలని చూస్తున్నట్టు తెలుస్తోంది.
డిసెంబర్ 4 లేదా డిసెంబర్ 5 తేదీల్లో అఖండ2 ను రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారని సమాచారం. అఖండ(akhanda) సినిమా కూడా డిసెంబర్ లోనే రిలీజై బ్లాక్ బస్టర్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు అఖండ2 ను కూడా అదే డిసెంబర్ లో రిలీజ్ చేసి మరోసారి డిసెంబర్ సెంటిమెంట్ ను కంటిన్యూ చేయాలని బాలయ్య(Balayya) చూస్తున్నారట. మరి చూడాలి ఆఖరికి ఏం జరుగుతుందో.













