Akhanda2: అఖండ2లో ఫ్యాన్స్ కు మరో సర్‌ప్రైజ్ ప్లాన్ చేసిన బాలయ్య

బాలకృష్ణ(Bala Krishna), బోయపాటి(Boyapati) కాంబినేషన్ అంటే అదొక ఎవర్ గ్రీన్ కాంబినేషన్. వీరిద్దరి కలయికలో ఇప్పటికే మూడు సినిమాలు రాగా ఆ మూడు సినిమాలూ ఒకదాన్ని మించి మరొకటి బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. కరోనా తర్వాత వచ్చిన అఖండ(Akhanda) సినిమా అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ బాలయ్య(Balayya) కెరీర్ లోని బెస్ట్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది.
దీంతో అఖండకు సీక్వెల్ గా అఖండ2(Akhanda2) ను ప్లాన్ చేసి ఆ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లారు. అఖండ కు సీక్వెల్ గా తెరకెక్కనుండటం, పైగా వీరిద్దరి కాంబినేషన్ వల్ల అఖండ2 పై భారీ హైప్ నెలకొంది. అయితే ఈ సినిమాలో బాలయ్య డ్యూయల్ రోల్ లో కనిపిస్తాడనే సంగతి తెలిసిందే. అందులో ఒక పాత్ర మామూలుగా ఉండగా మరోటి అఘోరా పాత్ర.
కానీ తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో బాలయ్యపై మూడో లుక్ ను కూడా ప్లాన్ చేస్తున్నాడట బోయపాటి. మిగిలిన రెండు లుక్స్ లాగానే ఈ మూడో లుక్ కూడా ఫ్యాన్స్ కు ఫుల్ ట్రీట్ ఇచ్చేలా ఉంటుందని టాక్ వినిపిస్తుంది. ఇందులో నిజమెంతన్నది తెలియదు కానీ టాక్ మాత్రం గట్టిగానే వినిపిస్తుంది. జూన్ 10న బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేస్తారని అంటున్నారు. తమన్(Thaman) సంగీతం అందిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.