Akhanda2: అఖండ2 షూటింగ్ లేటెస్ట్ అప్డేట్

నందమూరి నటసింహం బాలకృష్ణ(balakrishna) హీరోగా బోయపాటి శ్రీను(boyapati srinu) దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవెయిటెడ్ మూవీ అఖండ2 తాండవం(akhanda2 thandavam). బ్లాక్ బస్టర్ మూవీ అఖండకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై మొదటి నుంచి భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టే బోయపాటి అఖండ2(akhanda2) సినిమాను తెరకెక్కిస్తున్నాడు. వాస్తవానికి అఖండ2 ఈ నెలలో రిలీజవాల్సింది.
కానీ షూటింగ్ ఇంకా పెండింగ్ ఉండటంతో అఖండ2 వాయిదా పడింది. సినిమా సెప్టెంబర్ 25న రిలీజ్ కావట్లేదని మాత్రం మేకర్స్ క్లారిటీ ఇచ్చారు కానీ కొత్త రిలీజ్ డేట్ ను మాత్రం ఇంకా అనౌన్స్ చేయలేదు. ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావాల్సి వచ్చిందని తెలుస్తోంది. కాగా ఈ సినిమా షూటింగ్ పై లేటెస్ట్ అప్డేట్ ఒకటి వినిపిస్తోంది.
తాజా సమాచారం ప్రకారం అఖండ2 మేకర్స్ ప్రస్తుతం ఓ పార్టీ సాంగ్ ను షూట్ చేస్తున్నారని తెలుస్తోంది. ఆ సాంగ్ కు సంబంధించిన షూటింగ్ ఇవాల్టి నుంచే మొదలవగా, ఆ సాంగ్ ను హైదరాబాద్ లో వేసిన స్పెషల్ సెట్ లో తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ పాటతో అఖండ2 షూటింగ్ దాదాపు పూర్తవుతుందని అంటున్నారు. ప్రగ్యా జైస్వాల్(pragya jaiswal), సంయుక్త మీనన్(samyuktha menon) హీరోయిన్లు గా నటిస్తున్న ఈ సినిమాకు తమన్(thaman) సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే.