Akhanda2: అఖండ2 మేకర్స్ మౌనం.. అర్థంగీకారమేనా?
నందమూరి బాలకృష్ణ(nandamuri balakrishna) హీరోగా బోయపాటి శ్రీను(boyapati srinu) దర్శకత్వంలో వస్తోన్న సినిమా అఖండ2(Akhanda2). బ్లాక్ బస్టర్ మూవీ అఖండ(Akhanda)కు సీక్వెల్ గా రాబోతున్న సినిమా కావడంగో అఖండ2 పై మొదటి నుంచి భారీ అంచనాలున్నాయి. బాలయ్య(balayya)- బోయపాటి(boyapati) కలయికలో ఇప్పటికే మూడు సినిమాలు రాగా ఆ మూడు సినిమాలూ భారీ హిట్లుగా నిలిచాయి. ఇప్పుడు వీరి కలయికలో వస్తోన్న నాలుగో సినిమా ఇది.
ఈ మూవీ సెప్టెంబర్ 25న రిలీజ్ కానున్నట్టు మేకర్స్ అనౌన్స్ చేయగా, ఇప్పుడా రిలీజ్ డేట్ విషయంలో ఫ్యాన్స్ కు పెద్ద సస్పెన్స్ నెలకొంది. రిలీజ్ డేట్ కు ఎక్కువ టైమ్ లేకపోయినా మేకర్స్ ఇప్పటివరకు సినిమా నుంచి ఒక్క సాంగ్ ను కూడా రిలీజ్ చేయకపోవడంతో రిలీజ్ డేట్ పై ఫ్యాన్స్ కు అనుమానాలు ఎక్కువయ్యాయి. అయితే నిర్మాతలు కూడా ఈ విషయంలో మౌనం వహిస్తుండటంతో వాయిదా ఫిక్స్ అనుకుంటున్నారు.
మేకర్స్ చెప్పిన రిలీజ్ డేట్ కు ఎంతో ఎక్కువ టైమ్ లేదు. ఒకవేళ మేకర్స్ చెప్పిన డేట్ కే కట్టుబడి ఉంటే ఈపాటికి ప్రమోషన్స్ మొదలుపెట్టాలి. కానీ మౌనం వహిస్తుండటంతో మేకర్స్ కూడా వాయిదాని కన్ఫర్మ్ చేశారా అని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇప్పుడు అఖండ2 వాయిదా పడితే సంక్రాంతికి రిలీజ్ చేయాలని అనుకుంటున్నారని టాక్. ఏదేమైనా మేకర్స్ ఈ విషయంలో క్లారిటీ ఇస్తే బెటర్.







