Akhanda2: అఖండ2లో ఆ సీక్వెన్స్ హైలైట్

నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) ప్రస్తుతం బోయపాటి శ్రీను(Boyapati Srinu) దర్శకత్వంలో అఖండ2(Akhanda2) సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. బాలయ్య(Balayya)- బోయపాటి కాంబినేషన్ అంటే ఆడియన్స్ కు ఎన్నో అంచనాలుంటాయి. దానికి కారణం వీరిద్దరి కలయికలో ఇప్పటికే మూడు సినిమాలు రాగా ఆ మూడు సినిమాలూ ఒకదాన్ని మించి ఒకటి హిట్లుగా నిలవడంతో ఫ్యాన్స్ తో పాటూ మిగిలిన వారికి కూడా అంచనాలు భారీగా ఉంటాయి.
దానికి తోడు ఈ సినిమా బ్లాక్ బస్టర్ అఖండ(Akhanda)కు సీక్వెల్ గా తెరకెక్కుతుండటంతో అఖండ2 పై నెక్ట్స్ లెవెల్ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ఇప్పటికే ఓ రేంజ్ లో హైప్ ను క్రియేట్ చేసుకున్న ఈ సినిమాను బోయపాటి దాన్ని ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా తెరకెక్కిస్తున్నాడు. అయితే బోయపాటి సినిమాల్లో యాక్షన్ సీన్స్ కొంచెం కొత్తగా ఉండటంతో పాటూ కొన్ని కొన్ని పర్టిక్యులర్ లొకేషన్స్ ఉంటాయనేది మనం గమనించవచ్చు.
జయ జానకి నాయక(jaya janaki nayaka)లో హంసల దీవి ఫైట్, వినయ విధేయ రామ(vinaya vidheya rama)లో షర్ట్ లెస్ సీక్వెన్స్ లాగా ఒకన్ని స్పెషల్ ఎపిసోడ్స్ బోయపాటి సినిమాల్లో ప్రత్యేకంగా ఉంటాయి. ఇప్పుడు అఖండ2లో కూడా బోయపాటి అలాంటి ఓ యాక్షన్ సీక్వెన్స్ ను ప్లాన్ చేశాడట. అయితే ఈసారి ఆ లొకేషన్ మరింత స్పెషల్ గా ఉండబోతుందట. మంచు పర్వత ప్రాంతంలో హెలికాప్టర్లు, ట్రక్‌లు, ప్యాంజెర్లతో బోయపాటి ఈ యాక్షన్ సీక్వెన్స్ ను ప్లాన్ చేశాడట. సినిమా మొత్తంలో ఉన్న యాక్షన్ సీక్వెన్స్ లో ఇదే హైలైట్ గా నిలుస్తుందని, బిగ్ స్క్రీన్ పై ఈ విజువల్స్ నెక్ట్స్ లెవెల్ లో ఉంటాయని యూనిట్ సభ్యులంటున్నారు.