Akhanda2: 3డీ వెర్షన్ లో అఖండ2.. ఫ్యాన్స్ కు పూనకాలు గ్యారెంటీ
వరుస సక్సెస్ల్లో ఉన్న నందమూరి బాలకృష్ణ(balakrishna) ప్రస్తుతం అఖండ2(akhanda2) రిలీజ్ పనుల్లో బిజీగా ఉన్నారు. బోయపాటి శ్రీను(boyapati srinu) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అఖండ(akhanda) మూవీకి సీక్వెల్ గా తెరకెక్కుతుంది. బోయపాటి- బాలయ్య(balayya) కాంబినేషన్ సినిమా కావడంతో పాటూ అఖండ కు సీక్వెల్ గా వస్తున్న సినిమా కావడంతో అఖండ2పై ముందు నుంచి మంచి క్రేజ్ ఉంది.
డిసెంబర్ 5న అఖండ2 పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానుంది. అయితే అఖండ2 సినిమాను అఖండ కంటే భారీగా రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. అందుకే ఈ సినిమా విషయంలో ప్రతీదీ చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారు. రీసెంట్ గా రిలీజైన ఫస్ట్ సింగిల్ తాండవం ను ముంబైలో లాంచ్ చేసి నార్త్ మీడియాను ఎట్రాక్ట్ చేసిన మేకర్స్ ఇప్పుడు మరో బోల్డ్ స్టెప్ వేశారు.
అఖండ2 సినిమాను 2డీ వెర్షన్ తో పాటూ 3డీ వెర్షన్ లో కూడా రిలీజ్ చేయనున్నామని మేకర్స్ తాజాగా ప్రకటించారు. అంతేకాదు, ఇవాళ ప్రసాద్ ఐమ్యాక్స్ లో అప్గ్రేడ్ చేసిన కొన్ని విజువల్స్ ను మీడియాకు చూపించగా, వారి నుంచి క్వాలిటీ విషయంలోనూ, డైరెక్టర్ విజన్ పట్ల మంచి ప్రశంసలు వచ్చాయని తెలుస్తోంది. 3డీ వెర్షన్ లో బాలయ్య స్క్రీన్ ప్రెజెన్స్ నెక్ట్స్ లెవెల్ లో ఉందని ఆ విజువల్స్ చూసిన వారు చెప్తున్నారు. చూస్తుంటే అఖండ2 తో బాలయ్య తాండవం చూడటం ఖాయంగానే కనిపిస్తుంది.






