దసరాకి బాలయ్య ‘అఖండ’ సందడి?
బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న అఖండ చిత్రీకరణ కొన్నాళ్లుగా శరవేగంగా సాగుతోంది. రామోజీ ఫిలింసిటీలో కీలక సన్నివేశాల్ని తెరకెక్కించారు. రెండు పాటలు మాత్రమే తెరకెక్కించాల్సి ఉందని సినీ వర్గాలు తెలిపాయి. మరో పక్క నిర్మాణానంతర కార్యక్రమాలు కూడా శరవేగంగా సాగుతున్నాయి. ఈ జోరు చూస్తుంటే అఖండ సందడి దసరాకి ఖాయమనే అర్థమవుతోంది. బాలకృష్ణ, బోయపాటి శ్రీను కలయికలలో రూపొందుతున్న మూడో చిత్రమిది. ఇందులో బాలయ్య రెండు పాత్రల్లో సందడి చేస్తారు. ఆయనకి జోడిగా ప్రగ్యా జైశ్వాల్, పూర్ణ నటించారు. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాత.













