యాదాద్రిని దర్శించుకున్న బాలయ్య
అఖండ సినిమా విజయం దైవ సంకల్పమని హీరో నందమూరి బాలకృష్ణ అన్నారు. విజయోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి వరుసగా పుణ్యక్షేత్రాలను సందర్శిస్తున్నారు బాలయ్య. తాజాగా అఖండ టీంతో కలిసి యాదాద్రిని దర్శించారు. డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితులు ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయ పునర్మిర్మాణ పనులను పరిశీలించిన బాలయ్య ముఖ్యమంత్రి కేసీఆర్పై ప్రశంసలు కురిపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవతో యాదాద్రి పునర్నిర్మాణం అద్భుతంగా ఉందని కొనియాడారు.













