వికారాబాద్ అడవుల్లో అఖండకు ముగింపు
బాలయ్య, బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న అఖండ లో ప్రగ్యా జైస్వాల్, పూర్ణ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సీనియర్ యాక్టర్ శ్రీకాంత్ ఇందులో కీలక పాత్ర చేస్తున్నారు. ఫ్యాక్షనిస్ట్ గా, అఘోరా గా బాలయ్య ఇందులో కూడా ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఉగాది సందర్భంగా విడుదలైన ఈ సినిమా టీజర్ కు విశేష స్పందన లభించింది. తక్కువ టైమ్ లో ఎక్కువ వ్యూస్ అందుకున్న సీనియర్ హీరో టీజర్ లలో రికార్డ్ కూడా క్రియేట్ చేసింది.
ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్ ఆఖరికి చేరుకుంది. కోవిడ్ తో కేర్ తీసుకుంటూ షూటింగ్ ను పూర్తి చేస్తుంది యూనిట్. ప్రస్తుతం మొయినాబాద్ రిసార్ట్స్ లో బాలయ్య, ప్రగ్యా మీద కీలక సీన్స్ ను షూట్ చేస్తున్నారని తెలుస్తుంది. దీని తర్వాత వికారాబాద్ ఫారెస్ట్ లో బాలయ్య, శ్రీకాంత్ తో క్లైమాక్స్ సీన్స్ కు తెరకెక్కిస్తారట. మే 28న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ఇప్పటికే మేకర్స్ అనౌన్స్ చేశారు. మరి ఈ సిట్యుయేషన్స్ లో చెప్పిన టైమ్ కు రిలీజ్ ఉంటుందా లేదా అనేది మాత్రం చూడాలి.
ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా అఖండను నిర్మిస్తుండగా, థమన్ స్వరాలు సమకూరుస్తున్నాడు. సింహా, లెజెండ్ లాంటి బ్లాక్ బస్టర్ల తర్వాత బాలయ్య, బోయపాటి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఇప్పుడొస్తున్న అఖండ ఖచ్చితంగా హ్యాట్రిక్ సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నారు ప్రేక్షకులు.













