Akhanda2: బాలయ్యను ఘనంగా సత్కరించిన అఖండ2 టీమ్
పద్మ భూషణ్ అవార్డు అందుకున్న నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) రీసెంట్ గా అఖండ2 తాండవం(Akhanda2 thandavam) సెట్స్ లో జాయిన్ అయ్యాడు. ఈ సందర్భంగా ఆయనకు చిత్ర యూనిట్ పూలు చల్లి ఘన స్వాగతం పలికారు. డైరెక్టర్ బోయపాటి శ్రీను(Boyapati Srinu), నిర్మాతలు రామ ఆచంట(ram achanta), గోపీచంద్ ఆచంట(Gopichand Achanta) బాలయ్యను ఘనంగా సత్కరించి విషెస్ తెలియచేశారు.
ఈ వీడియో మొత్తానికి అఖండ2 మేకర్స్ సోషల్ మీడియాలో షేర్ చేయగా అది వైరలవుతోంది. ఇక సినిమా విషయానికొస్తే అఖండకు సీక్వెల్ గా రూపొందుతున్న అఖండ2 తాండవంపై అందరికీ భారీ అంచనాలున్నాయి. రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన స్పెషల్ సెట్స్ లో ఈ చిత్ర షూటింగ్ నిన్నటి నుంచి మొదలైంది.
ప్రగ్యా జైస్వాల్(Pragya Jaiswal) తో పాటూ సంయుక్త మీనన్(Samyuktha menon) కీలక పాత్రలో నటించున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తుండగా బాలయ్య చిన్న కూతురు తేజస్వినీ(tejaswini) ఈ సినిమాను సమర్పిస్తుంది. ఇప్పటికే బాలయ్య- బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు హ్యాట్రిక్ హిట్లు అయిన నేపథ్యంలో అఖండ2 ఎన్ని ఘనతలు సాధిస్తుందో అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.













