Akhanda-2: #BB4 అఖండ 2: తాండవం- డిసెంబర్ 5న థియేట్రికల్ రిలీజ్

‘గాడ్ ఆఫ్ ది మాసెస్’ నందమూరి బాలకృష్ణ (Balakrishna), బ్లాక్ బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను డైనమిక్ అండ్ పవర్ ఫుల్ ఫోర్త్ కొలాబరేషన్ లో మోస్ట్ అవైటెడ్ హై-ఆక్టేన్ సీక్వెల్ ‘అఖండ 2: తాండవం’ (Akhanda-2) పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో ఉంది.14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌ను ఎం తేజస్విని నందమూరి సగర్వంగా సమర్పిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన అఖండ 2 టీజర్ భారీ బజ్ క్రియేట్ చేసి అభిమానులను ఉర్రూతలూగించింది.
మేకర్స్ మరింత ఎక్సయిట్మెంట్ క్రియేట్ చేస్తూ సినిమా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. అఖండ 2: తాండవం డిసెంబర్ 5, 2025న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సీక్వెల్ ఒక గ్రేట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందించబోతోంది. బోయపాటి శ్రీను బిగ్గెస్ట్ కాన్వాస్‌పై లార్జర్ దెన్ లైఫ్ మూవీ రూపొందిస్తున్నారు.
రిలీజ్ డేట్ పోస్టర్‌లో బాలకృష్ణ లాంగ్ హెయిర్, రగ్గడ్ బీర్డ్‌తో పవర్‌ఫుల్‌గా కనిపిస్తున్నారు. మెడ నిండా పవిత్ర మాలలు, ఆభరణాలు, చేతిలో భారీ త్రిశూలం, కాషాయం, గోధుమరంగు సంప్రదాయ దుస్తులు ఆయన లుక్‌కి మైథాలజికల్, డివైన్ వైబ్ జోడించాయి. మంచుతో నిండిన ప్రకాశవంతమైన బ్యాక్‌డ్రాప్‌లో కనిపించిన లుక్ అదిరిపోయింది.
ఎస్. థమన్ అందిస్తున్న పవర్ ఫుల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి హై వోల్టేజ్ ఎనర్జీ అందించబోతోంది. అభిమానులు, మాస్ ఆడియెన్స్ బాలయ్య డివైన్ ఫెరోషియస్ అవతార్ కట్టిపడేసింది.
కొత్త రిలీజ్ డేట్‌తో ప్రమోషన్స్‌కు టీమ్‌కు మరింత సమయం దొరికింది. రెగ్యులర్ అప్‌డేట్స్, సర్ప్రైజ్‌లతో అలరించేలా ప్లాన్ చేస్తున్నారు.
ఈ చిత్రంలో సంయుక్త ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. ఆది పినిశెట్టి ఓ పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. హర్షాలి మల్హోత్రా కీలక పాత్రలో కనిపించనున్నారు.
సి.రాంప్రసాద్, సంతోష్ D Detakae సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, తమ్మిరాజు ఎడిటర్. ఎఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.
పవర్ ఫుల్ టీమ్, భారీ అంచనాలతో రాబోతున్న అఖండ 2: తాండవం గ్రేట్ స్పిరుచువల్, యాక్షన్ విజువల్ వండర్ ఎక్స్ పీరియన్స్ ని అందించబోతోంది.