ఇద్దరూ అదరగొట్టారుగా!
ఒకరు డైరెక్టర్ కొడుకు, మరొకరు ఫైట్ మాస్టర్ కొడుకు. ఇద్దరూ కలిసి ఓ అద్భుతమైన వీడియోను పోస్ట్ చేశారు. డైరెక్టర్ పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాష్ పూరి, ఫైట్‌మాస్టర్ విజయ్ కుమారుడు రాహుల్ విజయ్ కలిసి పూరి జగన్నాథ్ సినిమాల్లోని బాగా పాపులర్ అయిన డైలాగ్స్‌తో ఓ డబ్స్మాష్ చేశారు. బద్రి, ఇడియట్, శివమణి, పోకిరి, టెంపర్, ఇస్మార్ట్ శంకర్, బుజ్జిగాడు, బిజినెస్మెన్, పైసా వసూల్, దేశముదురు సినిమాల్లో ఎంతో పాపులర్ అయిన డైలాగ్స్ ఉన్నాయి. వాటితో ఇద్దరూ విడివిడిగా చేసిన వీడియోలను అద్భుతంగా లింక్ చేసి పోస్ట్ చేసిన ఈ వీడియో చాలా వైరల్ అవుతోంది. ఈ వీడియోపై డైరెక్టర్ అనిల్ రావిపూడి స్పందిస్తూ సూపర్‌గా ఉంది అని పోస్ట్ చేశాడు. దానికి ఆకాష్ పూరి స్పందిస్తూ.. ఒక్క ఛాన్స్.. గుర్తుపెట్టుకోండి అని పోస్ట్ చేశాడు. తన సినిమాల్లోని డైలాగ్స్‌తో ఆకాష్ పూరి, రాహుల్ విజయ్ చేసిన వీడియోను చూసిన పూరి జగన్నాథ్ స్పందిస్తూ సూపర్ లవ్ యూ అంటూ స్పందించడం విశేషం.













