Akanksha Sharma: విశ్వక్ హీరోయిన్ లక్ భలేగుందే
ఎవరికైనా ముందు సినిమా రిలీజై అది హిట్టైతే తర్వాత వరుస ఛాన్సులొస్తాయి కానీ ఆకాంక్ష శర్మ(Akanksha Sharma) కు మాత్రం మొదటి సినిమా సెట్స్ లో ఉండగానే అవకాశాలు క్యూ కడుతున్నాయి. విశ్వక్సేన్(Viswaksen) హీరోగా రూపొందిన లైలా సినిమాలో హీరోగా నటించిన ఆకాంక్ష శర్మకు లైలా(Laila) కాకుండా మూడు సినిమాలు చేతిలో ఉన్నాయి.
ఆ నాలుగింటిలో ముందుగా రిలీజయ్యేది లైలానే కాబట్టి అదే తన డెబ్యూ మూవీ అవుతుంది. వాస్తవానికి ఆకాంక్ష తెలుగులో సినిమా కమిట్ అవకముందే బాలీవుడ్ లో మూడు సినిమాలకు సైన్ చేసింది. అందులో ఒకటి సునీల్ శెట్టి(Suneel Setty), వివేక్ ఒబెరాయ్(Vivek Oberai) నటిస్తున్న కేసరి వీర్ కాగా, రెండోది మిలర్ జవేరీ(Milar Jaweri) దర్శకత్వంలోని తేరా యార్ హూ మై. ఆకాంక్ష అన్నింటికంటే ముందుగా సైన్ చేసిన సినిమా ఇదే.
మూడో సినిమా కూడా మిలర్ జవేరీ దర్శకత్వంలోనే. మొత్తానికి ఒక సినిమా కూడ రిలీజ్ కాకుండానే అమ్మడికి ఒకటికి మూడు ఛాన్సులు రావడమంటే తనకి అదృష్టం ఓ రేంజ్ లో ఉంది. లైలా రిలీజ్ తర్వాత టాలీవుడ్ నుంచి కూడా అవకాశాలు క్యూ కట్టే ఛాన్సుంది. రామ్ నారాయణ్(Ram Narayan) దర్శకత్వంలో తెరకెక్కిన లైలా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.













