Aishwarya Rajesh: భాగ్యం పాత్ర మొదటి ఛాయిస్ ఐశ్వర్య కాదట!
సంక్రాంతికి వస్తున్నాం(Sankranthiki Vasthunnam) సినిమాలో నటన పరంగా వెంకీ(Venkatesh) తర్వాత ఎక్కువ స్కోప్ ఉన్నది ఐశ్వర్యా రాజేష్(Aishwaya Rajesh) కే. గ్లామర్ పరంగా మీనాక్షి(Meenakshi)కి ఛాన్స్ ఉన్నప్పటికీ నటన పరంగా మాత్రం ఐశ్వర్య అన్ని చోట్లా డామినేట్ చేసేసింది. భాగ్యం పాత్రలో ఓ వైపు అమాయకత్వం, మరోవైపు నిస్సహాయత అన్నింటినీ మించి బావ మీద విపరీతమైన ప్రేమ ఉన్న పదహారణాల భార్య పాత్రలో ఐశ్వర్య అందరినీ మెప్పించింది.
అయితే ఈ పాత్రకు ముందుగా డైరెక్టర్ అనిల్ రావిపూడి(Anil Ravipudi) అనుకున్నది ఐశ్వర్యని కాదట. మరో ఇద్దరు ముగ్గుర్ని అడిగితే వారు నలుగురు పిల్లల తల్లి అనేసరికి వెనుకడుగేయడటంతో ఆ పాత్ర ఐశ్వర్య దగ్గరకు వెళ్లిందట. పాత్రలోని వెయిట్ ను గుర్తించిన ఐశ్వర్య కథ వినగానే ఏ మాత్రం ఆలోచించకుండా ఓకే చెప్పేసిందట.
కామెడీ పరంగా కూడా ఐశ్వర్య ది బెస్ట్ ఇచ్చింది. ఈ విషయాన్ని ఐశ్వర్యా రాజేషే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. అయినా పిల్లల తల్లిగా నటించిన మాత్రాన ఆఫర్లు రావనేది పిచ్చి నమ్మకం. గతంలో ఎంతో మంది హీరోయిన్లు అలాంటి పాత్రలు చేసి తమ సత్తా చాటుకున్నారు. ఏదేమైనా సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ఐశ్వర్యకు మంచి హిట్ లభించింది.













