ఐశ్వర్య రాజేష్ కు జాక్‌పాట్
విలక్షణ హీరో కమల్‌హాసన్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ఇండియన్ 2. ఈ చిత్రంలో ఒక హీరోయిన్గా ఐశ్వర్య రాజేష్‌ను ఎంపిక చేశారని తెలిసింది. కొంత గ్యాప్ తర్వాత ఈ చిత్ర షూటింగ్ ఆగస్ట్ నుండి తిరిగి మొదలుకానుంది. ఇలాంటి క్రేజీ ప్రాజెక్ట్‌లో అవకాశం అంటే ఐశ్వర్యకు జాక్ పాట్ తగిలినట్టే. ఇక ప్రస్తుతం ఈ భామ నటించిన నాలుగు తమిళ చిత్రాలు పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉండగా మరో నాలుగు కొత్త చిత్రాలను ఇటీవల ప్రకటించారు. ఇవి కాకుండా తెలుగులో మూడు చిత్రాలు ఆమె చేతిలో ఉన్నాయి.













