ఐశ్వర్యరాయ్ కొడుకును నేనే?
బాలీవుడ్ బ్యూటీ ఐశ్యర్యరాయ్కు ఓ కూతురు ఉందన్న విషయం తెలిసిందే కదా. ఆమె పేరు ఆరాధ్య అని కూడా అందరికీ తెలుసు. మార మాజీ మిస్ వరల్డ్‌కి కొడుకు ఎక్కడి నుంచి వచ్చాడన్న సందేహం కలగడం సహజమే. కానీ విశాఖపట్నంకు చెందిన ఓ 29 ఏళ్ల యువకుడు మాత్రం తన తల్లి ఐశ్యర్యరాయేనని చెప్పడం అందర్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. 1988లో ఐవిఎఫ్ ద్వారా తాను ఐశ్వర్యకు పుట్టినట్లు ఆ యువకుడు చెబుతున్నాడు. అతని పేరు సంగీత్‌కుమార్. అదే కాకుండా తన పేరుకు ఈ మధ్యలో రాయ్ అని ఐశ్వర్య పుట్టింటి పేరు టాగ్ తగిలించుకున్నాడు. లండన్‌లో 1988లో ఐవిఎఫ్ ద్వారా తాను ఐశ్వర్యకు జన్మించనని, రెండేళ్ల వరకు ఐశ్వర్య తల్లిదండ్రులు బృందా, క్రిష్ణరాజ్ రాయ్‌ల దగ్గరే పెరిగానంటున్నాడు. మూడేళ్ల వయస్సులో తనని విశాఖపట్నం తీసుకొచ్చారని, మా తాత క్రిష్టరాజ్ రాయ్ గతేడాది ఏప్రిల్‌తో తుదిశ్వాస విడిచారు. మా అంకుల్ పేరు ఆదిత్య రాయ్ అని ఈ సంగీత్ కుమార్ అనే వ్యక్తి మీడియాతో మాట్లాడుతూ చెప్పాడు.
2007లో తన తల్లి ఐశ్వర్య అభిషేక్‌ను పెళ్లి చేసుకున్నారు. వాళ్లిద్దరూ ఇప్పుడు వేర్వేరుగా ఉంటున్నారని సంగీత్ అంటున్నాడు. 27 ఏళ్లుగా తన తల్లికి దూరంగా ఉన్నానని, ఇప్పుడైనా ఆమె మంగళూరుకు వచ్చిన తనతో ఉండాలని కోరుతున్నాడు. విశాఖపట్నం తిరిగి వెళ్లాలనుకోవడం లేదని కూడా అతను పేర్కొన్నాడు. అయితే ఐశ్వర్య తన తల్లి అని నిరూపించడానికి అతని దగ్గర ఎలాంటి సాక్ష్యాధారాలు లేవు. వైజాగ్‌లో ఉండగా తన బంధువులు ఆధారాలు లేకుండా చేశారని, దీంతో ఐశ్వర్య దగ్గరికి వెళ్లలేకపోయాని తెలిపాడు.













