ఐశ్వర్యరాయ్ మరో చిత్రానికి గ్రీన్‌సిగ్నల్
ఐశ్వర్యరాయ్ తెరపై కనిపించి ఏడాది దాటిపోయింది. బాలీవుడ్ చిత్రం ఫన్నే ఖాన్ తర్వాత కొత్త చిత్రంపై సంతకం చేయలేదు ఈ ముద్దుగుమ్మ. సెకండ్ ఇన్నింగ్స్‌లో నిదానంగా సినిమాలు చేస్తున్న ఆమె తాజాగా మణిరత్నం దర్శకత్వంలో తమిళంలో పొన్నియన్ సెల్వన్ చిత్రాన్ని అంగీకరించింది. చారిత్రక కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఐశ్వర్యరాయ్ తల్లీకూతుళ్లుగా ద్విపాత్రాభినయం చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మందాకిని దేవి అనే మహారాణిగా, యువరాణి నందినిగా రెండు భిన్న పాత్రల్లో ఆమె కనిపించబోతున్నట్లు చెబుతున్నారు. ఛోళ సామ్రాజ్య పతనానికి కారణమైన యువరాణి నందినిగా ఆమె పాత్ర నెగెటివ్ షేడ్స్‌తో సాగనున్నట్లు సమచారం. మూగ మహారాణిగా మందాకిని పాత్ర ఛాలెంజింగ్‌గా ఉంటుందని తెలిసింది. ఐశ్వర్యరాయ్ పాత్రల ప్రధానంగానే ఈ కథ సాగనున్నట్లు సమచారం. విక్రమ్, జయం రవి, కార్తి, మోహన్‌బాబు, కీర్తిసురేష్, అమలాపాల్ ప్రధాన పాత్రల్లో నటించనున్నట్లు తెలిసింది.













