అమెరికాలో ఐశ్వర్యకు గౌరవం
బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్య రాయ్ బచ్చన్‌కు అమెరికాలో అరుదైన గౌరవం దక్కింది. వాషింగ్టన్ డీసీలో నిర్వహించిన ఉమెన్ ఇన్ ఫిల్మీ అండ్ టెలివిజన్(విఫ్ట్) అవార్డ్స్‌లో భాగంగా అలనాటి హాలీవుడ్ నటి మెరిల్ స్ట్రీప్ పేరిట ఓ అవార్డును ఏర్పాటు చేశారు. ఐశ్వర్యకు మెరిల్ స్ట్రీప్ అవార్డు వరించింది. ఈ అవార్డు అందుకున్న ఏకైక సినీ సెలబ్రిటీ ఐశ్వర్యరాయ్. ఐష్ తన తల్లి బృందా రాయ్, కుమార్తె ఆరాధ్యతో కలిసి ఈ కార్యక్రమానికి వెళ్లారు. శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ ఎమిరాల్డ్ అవార్డు స్వీకరించారు. ఇటీవల ఫన్నే ఖాన్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఐశ్వర్య. త్వరలో తన భర్త అభిషేక్‌తో కలిసి గులాబ్ జామున్ సినిమాలో నటించబోతున్నారామె.













