అలాంటిదేమీ లేదు… ఐశ్వర్యరాయ్
ప్రముఖ బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్‌కి ఓ ఫోటో వల్ల చేదు అనుభవం ఎదురైంది. ఆ ఫొటోలో ఐశ్వర్య కనిపిస్తున్న తీరు చూసి ఆమె రెండోసారి గర్భవతి అయిందంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే వాస్తవంగా ఐశ్వర్య గర్భవతి కాదు. ఇదే విషయంపై ఆమె మేనేజర్ స్పందించారు. అది కెమెరా యాంగిల్ పొరపాటు. అంతే తప్ప ఐష్ గర్భవతి కాదు. ఇలాంటి ఫొటోల ఆధారంగా సెలబ్రిటీల వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోవడం సబబు కాదు అని మేనేజర్ చెప్పారు. భర్త అభిషేక్‌బచ్చన్, కూతురు ఆరాధ్యతో కలిసి ఐశ్వర్య విహారయాత్ర నిమిత్తం గోవా వెళ్ళారు. అక్కడ దిగిన ఓ ఫొటో వల్ల ఇదంతా జరిగింది.













