Aishwarya Menon: సింపుల్ లుక్స్ లో ఇంప్రెస్ చేస్తున్న ఐశ్వర్య
పదేళ్ల కిందట సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఐశ్వర్య మీనన్(Aishwarya Menon) తక్కువ టైమ్ లోనే మంచి గుర్తింపు సంపాదించుకుంది. 2013 నుంచి వరుసపెట్టి సినిమాలు చేస్తున్న ఐశ్వర్యకు సినిమాలతో వచ్చిన క్రేజ్ కంటే సోషల్ మీడియా ద్వారా వచ్చిన క్రేజే ఎక్కువ. అమ్మడు సోషల్ మీడియాలో షేర్ చేసే ఫోటోల కోసం ఆమె ఫాలోవర్లు తెగ ఎదురుచూస్తుంటారు. తాజాగా ఐశ్వర్య కొన్ని అందాల ఆరబోత ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోల్లో అమ్మడు సిల్వర్ కలర్ టాప్, బ్లాక్ బాటమ్ లో సింపుల్ గా కనిపిస్తూనే తన అందాలు ఎలివేట్ అయ్యేలా పోజులిచ్చింది. ఈ ఫోటోలకు నెటిజన్లు లైకుల వర్షం కురిపిస్తున్నారు.













