Dhoolpet Police Station: ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ‘ధూల్ పేట్ పోలీస్ స్టేషన్’
సరికొత్త కంటెంట్ తో ఆడియెన్స్ థ్రిల్ చేస్తున్న ఆహా ఓటీటీ మరో ఎగ్జైటింగ్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘ధూల్ పేట్ పోలీస్ స్టేషన్’ (Dhoolpet Police Station) ను స్ట్రీమింగ్ కు తీసుకొచ్చింది. ఈ సిరీస్ లో మొత్తం 50 ఎపిసోడ్స్ ఉన్నాయి. ప్రతి శుక్రవారం రాత్రి 7 గంటలకు కొత్త ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు తమిళ భాషల్లో ‘ధూల్ పేట్ పోలీస్ స్టేషన్’ సిరీస్ అందుబాటులో ఉంది. ఈ వెబ్ సిరీస్కు జెస్విని దర్శకత్వం వహించారు. అశ్విన్, శ్రీతు, పదిని కుమార్, గురు, ప్రీతి శర్మ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
ఈ సిరీస్ కు అశ్వతన్ మ్యూజిక్ అందించారు. ధూల్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకే రాత్రి మూడు హత్యలు జరిగితే ఆ కేసును ఇద్దరు పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్స్ ఎలా సాల్వ్ చేశారనేది ఈ సిరీస్ లో ఆసక్తికరంగా తెరకెక్కించారు దర్శకుడు. నగరంలో ఒకే రాత్రి జరిగిన 3 హత్యల కేస్ సాల్వ్ చేసేందుకు రంగంలోకి దిగిన ఏసీపీ అశ్విన్ నేరస్తులను పట్టుకున్నాడా లేదా ఈ కేసుల విచారణ ఎలాంటి మలుపులు తిరిగింది అనేది ‘ధూల్ పేట్ పోలీస్ స్టేషన్’ సిరీస్ లో చూడాలి.






