‘అజ్ఞాతవాసి’ థియేట్రికల్ ట్రైలర్ విడుదల
పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘అజ్ఞాతవాసి’. కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్ కథానాయికలు. త్రివిక్రమ్ దర్శకుడు. అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు. టీజర్‌కు దీటుగా దీన్ని తీర్చిదిద్ది సినిమాపై ఆసక్తిని మరింత పెంచేశారు.
అసలు ఎవరూ ఊహించని విధంగా ట్రైలర్ ఉంది. ఈ ట్రైలర్లో కుర్చీ కథ చెప్పి జీవిత సత్యాన్ని వివరించారు పవర్ స్టార్. “ఇది మనం కూర్చునే కుర్చీ… పచ్చటి చెట్టును గొడ్డలితో పడగొట్టి, రంపంతో ముక్కలు ముక్కలుగా కోసి, బెరడును బ్లేడుతో సానబెట్టి, ఒళ్లంతా మేకులతో కొట్టి కొట్టి తయారు చేస్తారు. ఎంత హింస దాగుందో కదా?…జీవితంలో మనం కోరుకునే ప్రతి సౌకర్యం వెనకా ఓ మినీ యుద్ధమే దాగుంది” అంటూ పవన్ కళ్యాణ్ అదరగొట్టారు.













