పవన్‌కల్యాణ్ “అజ్ఞాతవాసి” ఫస్ట్‌లుక్ విడుదల
పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సర్ప్రైజ్ వచ్చేసింది. పవన్ కల్యాణ్-త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం ఫస్ట్‌లుక్ విడుదలైంది. అందరూ అనుకుంటున్నట్టుగానే ఈ సినిమాకు “అజ్ఞాతవాసి” అనే టైటిల్‌ను ఖరారు చేశారు. టైటిల్‌తోపాటు పవన్ కల్యాణ్ సోఫాలో కూర్చుని ఐడీ కార్డును తిప్పుతున్న స్టిల్‌ను కూడా విడుదల చేశారు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వారణాశిలో జరుగుతుండడంతో అక్కడే ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. రెండ్రోజుల నుంచే సోషల్ మీడియాలో `పీఎస్పీకే 25 ఫస్ట్‌లుక్` హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లో ఉంది. మొదట ఈ రోజు10 గంటలకు విడుదల చేస్తామని చెప్పారు కానీ సాంకేతిక సమస్యలు తలెత్తడంతో కొంత జాప్యం జరిగింది. కీర్తి సురేశ్, అను ఇమ్మానుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందకు రానుంది.













