ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ ప్రీరిలీజ్ వేడుక
నవీన్ పొలిశెట్టి, శృతి శర్మ ప్రధానపాత్రధారులుగా రూపొందుతున్న చిత్రం ఏజెంట్సాయి శ్రీనివాస ఆత్రేయ. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుని యుబైఎ సర్టిఫికెట్ అందుకుంది. స్వరూప్ ఆర్ఎస్జె దర్శకుడు. రాహుల్ యాదవ్ నక్కా నిర్మాత. ఈ చిత్రాన్ని ఈనెల 21న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ప్రముఖ హీరో సాయితేజ్ మాట్లాడుతూ నవీన్ మంచి యాక్టర్ అని, ఇపుడు తన సినిమాల్లోకి రావటం ఆనందంగా
ఉందన్నారు. ఓ మంచి సినిమాతో మన ముందుకు రాబోతున్నాడని అన్నారు. ఈ సినిమా రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని అన్నారు. నవీన్ పొలిశెట్టి మాట్లాడుతూ హీరో కావాలనేది తన డ్రీమ్ అని, ఆ కల నెరవేరిందన్నారు. రెండున్నరేళ్ల కష్టపడి చేసిన సినిమా అన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ స్వరూప్ ఆర్ఎస్జె, గౌతమ్ తిన్నసూరి, చిత్ర నిర్మాత రాహుల్ యాదవ్, ప్రముఖ దర్శకుడు మహా వెంకటేష్ తదితరులు మాట్లాడారు.













