అతడి పరిశోధన ఎందుకోసం?
నవీన్ పొలిశెట్టి, శృతిశర్మ జంటగా నటిస్తున్న చిత్రం ఏజెంట్ సాయిశ్రీనివాస్ ఆత్రేయ. స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై రాహుల్ యాదవ్ నక్కా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. స్వరూప్ ఆర్.ఎస్.జె. దర్శకత్వం వహిస్తున్నారు. సెన్సార్ పూర్తయింది. యు.ఏ సర్టిఫికెట్ లభించింది. ఈ నెల 21న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. నిర్మాత మాట్లాడుతూ సాయి శ్రీనివాస్ ఆత్రేయ అనే డిటెక్టివ్ కథ ఇది. అతడి పరిశోధన ఎందుకోసం? చిన్న కేసులను చేపట్టే అతడు ఓ పెద్ద లక్ష్యాన్ని ఎలా పూర్తిచేశాడన్నది ఉత్కంఠభరితంగా ఉంటుంది. స్క్రీన్‌ప్లే ప్రధానంగా సాగే కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమా ఇది. టేకింగ్ భిన్నంగా ఉంటుంది. ఆద్యంతం నవ్విస్తూనే థ్రిల్‌కు గురిచేస్తుంది. ఫస్ట్ లుక్, టీజర్‌కు చక్కటి స్పందన లభిస్తున్నది. కొత్త దనాన్ని కోరుకునే ప్రతి ఒక్కరిని ఈ సినిమా మెప్పిస్తుంది అని తెలిపారు.













