స్కంద రిలీజ్ తర్వాత పొలిటికల్ రచ్చ ఖాయమే
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు రాబోతున్నాయి. కాబట్టి వాటిని టార్గెట్ చేసుకుని ఫుల్ రేంజ్ పొలిటికల్ సినిమాలు ఓ పక్క వస్తుంటే, మరోవైపు రెగ్యులర్ సినిమల్లో కూడా పొలిటికల్ పంచులతో సినిమాకు మంచి హైప్ క్రియేట్ చేసుకుంటున్నారు. బాలయ్యకు అత్యంత సన్నిహితుడైన బోయపాటి శ్రీను తన సినిమాల్లో అధికార పార్టీను టార్గెట్ చేస్తూ ఉంటాడన్నది తెలిసిన విషయమే.
సరైనోడు సినిమాలో ఆది పినిశెట్టి క్యారెక్టర్ జగన్ ను లక్ష్యంగా చేసుకుని రాసుకుందే అని కూడా అందరూ అందరూ అంటూంటారు. ఇక లెజెండ్, అఖండ సినిమాల్లో బోయపాటి రాయించిన కొన్ని డైలాగ్స్ జగన్ మరియు అతని సన్నిహితులకు ఇన్‌డైరెక్ట్‌గా తగిలాయి. ఇక అసలు విషయానికొస్తే బోయపాటి నుంచి రాబోతున్న స్కంద మూవీలో కూడా పొలిటికల్ డైలాగ్స్ కు కొదవ లేదని రిలీజ్ ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది.
స్కందలో ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ బోయపాటి సినిమాలో కొన్ని పవర్ఫుల్ పొలిటికల్ డైలాగ్స్ పెట్టాడని, సినిమా రిలీజ్ తర్వాత ఆ డైలాగులు వేడి పెంచడం ఖాయమని తెలుస్తోంది. రిలీజ్ ముందు వరకు డైలాగ్స్ ను సీక్రెట్ గా పెట్టి, రిలీజ్ తర్వాత రచ్చ లేపనున్నారని సమాచారం. మరి రిలీజ్ తర్వాత స్కంద ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేస్తుందో చూడాలి.













