దేవర చూశాక పుష్ప నమ్మకం పెరిగింది
పుష్ప2(Pushpa2) రిలీజ్ కు మరో 67 రోజులే ఉన్నప్పటికీ రిలీజ్ డేట్ లో ఎలాంటి మార్పు జరిగే ఛాన్స్ లేకుండా బ్యాలెన్స్ షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ ని డైరెక్టర్ సుకుమార్(Sukumar) పరుగులు పెట్టిస్తున్నాడు. లాస్ట్ మినిట్ లో పోస్ట్ పోన్ అవుతుందేమోననే ఆశతో కొన్ని మిడ్ రేంజ్ సినిమాలు ముందు జాగ్రత్త చర్యగా తమ సినిమాలను రెడీ చేసుకుని పెట్టుకుంటున్నారు మిగిలిన నిర్మాతలు.
ఇక అసలు విషయానికొస్తే దేవర1(Devara1) ఓపెనింగ్స్ అదిరిపోయాయి. నిర్మాణ సంస్థ చెప్తున్న ప్రకారమే ఎక్కువగా అనిపిస్తోంది. దేవరకు రిలీజ్ ముందు వరకు బాలీవుడ్ లో పెద్ద క్రేజ్ లేదు. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. కానీ మొదటిరోజు టాక్ వచ్చాక మాత్రం కౌంటర్ బుకింగ్స్ ద్వారా అమ్మకాలు భారీగా జరిగాయి.
కానీ పుష్ప2 అలా కాదు. ఈ సినిమాకు ముందు నుంచే నార్త్ ట్రేడ్ లో మంచి క్రేజ్ ఉంది. పుష్ప1 ఇచ్చిన హైప్ వల్ల నార్త్ ఆడియన్స్ అందులోనూ మాస్ ఆడియన్స్ లో చాలా బజ్ ఉంది. మంచి ప్రమోషన్స్, ట్రైలర్ కట్ పడితే నార్త్ ఆడియన్స్ లో అంచనాలు ఇంకా పెరుగుతాయి. దీంతో నార్త్ మార్కెట్ నుంచి డే1 రూ.25 కోట్లకు పైగా కలెక్షన్స్ ఉండే ఛాన్సుంది. దేవరకు వచ్చిన రెస్పాన్స్ చూశాక పుష్ప2 నిర్మాతల కాన్ఫిడెన్స్ ఇంకా పెరిగింది. అన్ని రైట్స్ కలిపి పుష్ప2 టార్గెట్ రూ.1000 కోట్ల పైనే ఉంటుందని భావిస్తున్నారు.













