పోలీస్ పాత్రలో పాయల్
ఆర్ఎక్స్ 100 ఫేమ్ భామ పాయల్ రాజ్‌పుత్ నటించింది తక్కువ చిత్రాలే అయినప్పటికీ ఫాలోయింగ్ మాత్రం ఎక్కువ. ఆర్డిఎక్స్ లవ్, వెంకీమామ, డిస్కోరాజా చిత్రాల్లో పాయల్ నటించింది. ఈ చిత్ర విజయాల్లో భాగం పంచుకుంది. గ్లామర్ పాత్రలతో పాటు అభినయానికి అవకాశం ఉన్న క్యారెక్టర్స్ చేస్తోంది. తాజాగా గ్లామర్ పాత్ర నుండి మాస్ ఫాలోయింగ్ తెచ్చిపెట్టిన పోలీస్ పాత్రలో కనిపించనుంది. గుణశేఖర్ వద్ద పలు చిత్రాలకు దర్శకత్వ శాఖలో పనిచేసిన ప్రణదీప్ తాజా చిత్రానికి దర్శకుడు. ఇదొక నేర పరిశోధన్మాతక కథ. ఇందులో పాయల్ రాజ్‌పుత్ ఐపీఎస్ అధికార పాత్రలో కనిపిస్తుంది. సినిమా టైటిల్, ఫస్ట్‌లుక్, పోస్టర్‌ను మార్చి మొదటివారంలో విడుదల చేస్తారు.













