ప్రభాస్ కు మరో అరుదైన గౌరవం
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి చిత్రంలో అమరేంద్ర బాహుబలి, మహేంద్ర బాహుబలి గా నటించి, మెప్పించిన ప్రభాస్‌కు మరో అరుదైన గౌరవం దక్కనుంది. ఇటీవల బాహుబలి గెటప్‌లో ఉన్న ప్రభాస్ విగ్రహాన్ని బ్యాంకాక్‌లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచారు. ఇప్పుడు ప్రధాన శాఖ అయిన లండన్‌లోని మేడమ్ టుస్సాడ్ మ్యూజియంలో మరో బాహుబలి మైనపు విగ్రహం రూపొందించబోతున్నారట. మరోపక్క కట్టప్ప సత్యరాజ్ మైనపు విగ్రహాన్ని కూడా మేడమ్ టుస్సాడ్స్‌లో ఉంచనున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని సత్యరాజ్ కుమారుడు సిబిరాజ్ సోషల్‌మీడియా ద్వారా వెల్లడించారు.













