ఈ వారం ఆహాలో అడివి శేష్ మరియు శోభిత ధూళిపాళ తో అలరించబోతున్న ‘సర్కార్ 2 ‘ మరియు ‘తెలుగు ఇండియన్ ఐడల్’
ఓటిటి ప్లాట్ఫాం మనకు లెక్కలేనన్ని కథలు మరియు షోలను అందించింది. అది మనం ఎలాంటి మూడ్లో ఉన్నప్పటికీ మనల్ని అలరించేలా చేసింది. అలా తెలుగు లోగిల్లలో ఎప్పుడూ కొత్తదనాన్ని వెదజల్లే ప్లాట్ఫాం మన ఆహా. ఈవారం కూడా ఎప్పుడూ చూడని విధంగా సందడిని, సంగీతసుస్వరాల్ని మన ముందుకు తేనుంది. తెలుగు ఇండియన్ ఐడల్, సర్కార్ 2 వంటి షోలతో వినియోగదారులను ఆకర్షించిన 100% లోకల్ ఎంటర్టైన్మెంట్ ప్లాట్ఫాం , ఈ వారం ‘మేజర్’ టీమ్ అడివి శేష్, శోభిత ధూళిపాళ తో తమ ప్రియమైన అభిమానులని అలరించబోతుంది.
అందరికి దగ్గరివాడు, కవ్వించే చెలికాడు యాంకర్ ప్రదీప్ మాచిరాజు హోస్ట్ చేస్తున్న షో సర్కార్ 2. వారం వారం అందరిని అలరిస్తూ, మైమరిపిస్తున్న ప్రదీప్ ఈ సారి మేజర్ టీం తో చేస్తున్న గమ్మతులు చూడాలనుకుంటే ఈ శుక్రవారం సాయంత్రం 6 గంటలకు ఆహా తప్పక వీక్షించండి. అడివి శేష్ ప్రేక్షకులని అలరిస్తూ వేసే స్టెప్స్ అందరిని ఉర్రూతలూగిస్తాయి.
సంగీతం అంటే తెలుగు ఇండియన్ ఐడల్ లోని స్వరాలూ అనేలా ప్రఖ్యాతి గాంచిన మన తెలుగు ఇండియన్ ఐడల్ లో ఈ వారం అడివి శేష్ మరియు శోభిత చేసే అల్లరి అంతాఇంతా కాదు. వాగ్దేవి పాట వల్ల అడివి శేష్ మైమరిచిపోతే, ఆయనే వైష్ణవి తో డాన్స్ చేయాలని కోరడం మరో విశేషం. అలా ఆట పాటలతో సాగిపోయే ఈ సుస్వరాల వేదిక ఈ శుక్ర మరియు శనివారలలో మీ ఆహా లో రాత్రి 9 గంటలకు తప్పక చూడండి.
ఈ శుక్రవారం మరియు శనివారం, అంతులేని సంగీత వినోదం తో మీ ముందుకు వస్తుంది మీ ఆహా! మిస్ అవ్వకండి













