మరో సీక్వెల్ కి రెడీ అవుతున్న అడవి శేష్..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ పంజా ‘ చిత్రంలో విలన్ గా నటించి టాలీవుడ్ లో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు అడవి శేష్. కెరీర్ బిగినింగ్ లో విలన్ పాత్రలకి మాత్రమే పరిమితమైన శేష్, తనలోనూ హీరోయిజం ఉందని నిరూపించుకున్నాడు. ఈ క్రమంలోనే ” అమీ తుమీ, గూఢచారి, క్షణం, ఎవరు, మేజర్ ” వంటి చిత్రాలతో హీరోగా ప్రేక్షకుల ముందుకి వచ్చాడు.
వరుస హిట్లతో ప్రస్తుతం అడవి శేష్ దూసుకుపోతున్నాడు. రీసెంట్ గా ” హిట్ 2 ” సక్సెస్ తో మరోసారి తనేంటో నిరూపించుకున్నాడు. శైలేష్ కొలను దర్శకత్వంలో వచ్చిన ‘హిట్ ది సెకండ్ కేస్’ బాక్సాఫీస్ వద్ద మంచి పాజిటివ్ టాక్ తో రన్ అవుతుంది. ఈ సినిమా సక్సెస్ తో అడవి శేష్ తన కెరీర్ లో డబల్ హ్యాట్రిక్ ని సొంతం చేసుకున్నాడు.
ప్రస్తుతం శేష్ తన తదుపరి మూవీపై దృష్టి పెట్టాడు. గూఢచారి సినిమా కి సీక్వెల్ గా “గూఢచారి 2” ని ప్లాన్ చేస్తున్నాడని సమాచారం. మరోసారి దర్శకుడు శశికిరణ్ టిక్కా తో కలిసి పని చేయడానికి సిద్ధమవుతున్నాడని టాక్ వినిపిస్తుంది. ఈ కాంబోలో ఆల్రెడీ వచ్చిన గూఢచారి హిట్ అవ్వడంతో , సీక్వెల్ ఎలా ఉండబోతుందో అని ప్రేక్షకుల్లో ఆసక్తి మొదలైంది.
ఇప్పటికే సినిమా స్క్రిప్ట్ దర్శకుడు శశికిరణ్ మొదలుపెట్టినట్టు తెలుస్తుంది. గూఢచారి ఫస్ట్ పార్ట్ ఇటు థియేటర్స్ , అటు ఓటీటీ లోను మంచి బిజినెస్ చేసింది. దీంతో సెకండ్ పార్ట్ కూడా అదే రేంజ్ లో బిజినెస్ చేస్తుందనే నమ్మకంలో ఉన్నాడు అడవి శేష్. ప్రస్తుతం శేష్ కి ఉన్న క్రేజ్ దృష్ట్యా కథలో కొన్ని కీలక మార్పులు చేసినట్టు తెలుస్తుంది. త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళబోతున్న ఈ సినిమా మీద ప్రేక్షకులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు.













