Hit3: హిట్3లో అడివి శేష్ సర్ప్రైజింగ్ రోల్
నాని(Nani) ప్రస్తుతం హీరోగా నటిస్తున్న మూవీ హిట్ ది థర్డ్ కేస్(Hit: The Third Case). శైలేష్ కొలను(Sailesh Kolanu) దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను నాని హోమ్ బ్యానర్ వాల్ పోస్టర్ సినిమాస్(Wallposter Cinemas)పై భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ మే 1 న ఆడియన్స్ ముందుకు రానున్నట్టు ఇప్పటికే చిత్ర బృందం ప్రకటించింది. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా మంచి ఆదరణ పొందిన హిట్ ఫ్రాంచైజ్ సిరీస్ నుంచి ఎప్పుడెప్పుడు మూడో పార్ట్ రిలీజవుతుందా అని అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
హిట్ ది ఫస్ట్ కేస్(Hit1) లో విశ్వక్ సేన్(Viswaksen) హీరోగా కనిపించగా, హిట్2(Hit2)లో అడివి శేష్(Adivi Sesh) హీరోగా నటించాడు. ఇప్పుడు హిట్ ది థర్డ్ కేస్ నాని చేస్తున్నాడు. హిట్3లో నాని అర్జున్ సర్కార్(Arjun Sarkar) గా చాలా పవర్ఫుల్ పోలీసాఫీసర్ గా కనిపించనున్నట్టు హిట్2 క్లైమాక్స్ లోనే చూపించారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న హిట్3 షూటింగ్ దాదాపు ఆఖరి దశకు చేరుకుంది.
తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాలో అడివి శేష్ కీలక పాత్రలో కనిపించనున్నట్టు తెలుస్తోంది. అడివి శేష్ కోసం ఈ సినిమాలో డైరెక్టర్ ఎంతో బలమైన పాత్ర రాశాడని, ఆ క్యారెక్టర్ స్క్రీన్ పై కనిపించినప్పుడు ఆడియన్స్ అందరూ తప్పకుండా సర్ప్రైజ్ ఫీలవుతారని అంటున్నారు. ఈ విషయం తెలిశాక హిట్3పై ఉన్న అంచనాలు ఇంకాస్త పెరిగాయి.













